Header Banner

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

  Sat Feb 22, 2025 15:07        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలందరికీ రూ.25 లక్షల చొప్పున బీమా సదుపాయం కల్పించాలి అని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వైద్యాన్ని ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి తేవాలి అన్నదే ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. ఈ ఉచిత ఆరోగ్య బీమాని ఏప్రిల్ లేదా మే నెల నుంచి అమలు చేస్తారని తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి బీమాలను పేదవారికి మాత్రమే వర్తింపజేస్తారు. కానీ ఏపీ ప్రభుత్వం అందరికీ వర్తింపచెయ్యాలని నిర్ణయం తీసుకోవడం సంచలనం అనుకోవాలి. ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించాక.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు పొందే ఛాన్స్ ఉంటుంది. ఈ పథకాన్ని పైపైన అమలు చేసి వదిలేయాలి అని ప్రభుత్వం అస్సలు అనుకోవట్లేదు.

 

ఇది కూడా చదవండి: ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ఇందులో కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్‌ని తెస్తోంది. అంటే.. పేషెంట్ ఆపరేషన్‌కి సిద్ధపడగానే.. 6 గంటల్లోనే ఇన్సూరెన్స్ లెక్కలన్నీ వేసేసి.. చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. అందువల్ల రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. ఈ పథకం నిజానికి ప్రభుత్వానికి పెద్ద భారమే. ఎందుకంటే.. రూ.25లక్షల చొప్పున బీమా కల్పించేందుకు ప్రభుత్వం ఏపీలోని ప్రతి ఒక్కరి తరపున రూ.2,500 దాకా ప్రీమియం చెల్లించాలని నిర్ణయించుకుంది. ఇన్సూరెన్స్ కోసం ఎంపిక చేసిన బీమా సంస్థలకు ప్రభుత్వం ప్రతీ 3 నెలలకు ఓసారి ప్రీమియం వాయిదాలు చెల్లిస్తుంది. అది కూడా ముందే చెల్లిస్తుంది. అందువల్ల బిల్లుల సమస్యే ఉండదు. ప్రస్తుతం బీమా కింద 3,257 రకాల చికిత్సలు ఉన్నాయి. వీటిలో ఒక 30 దాకా ప్రత్యేక చికిత్సలు ఉన్నాయి. అందరికీ ఉచిత ఆరోగ్య బీమా వచ్చాక.. ఇవన్నీ కొనసాగుతాయి. మరోవైపు ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం కింద.. 1,949 చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రతీ కుటుంబానికీ సంవత్సరానికి రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు పొందే వీలు ఉంది. ఐతే.. ఇది అందరికీ కాదు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారికి మాత్రమే. ప్రభుత్వం కొత్తగా తెస్తున్న విధానం వల్ల.. అందరికీ ఈ సేవలు ఏటా లభిస్తాయి. మరోవైపు ఆరోగ్యశ్రీ సేవలు కూడా కొనసాగుతాయి. మొత్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఈ కొత్త పథకం అమలు చేసి, దీని విధి విధానాలను ప్రభుత్వం ఫైనల్ చెయ్యబోతోంది.

 

ఇది కూడా చదవండి: తల్లికి వందనం పథకంపై అపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్! డేట్ ఫిక్స్! ఈ నెలలో...

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations